Skip to content


మదురమైన తేనెను చిందించు నవకమలం వంటి

http://datastore.rediff.com/briefcase/605F6959676C5C5D736734/jx3j954zx7biu6r5.D.0.Princess_Rose_by_startrekker.jpgదట్టమైన వానమబ్బు వంటి దేహఛాయతో  కూడి ,చక్కని మంచి గంధపు పూతతో అద్దబడి , పీతాంబరములను ధరించిన కృష్ణుడు తులసీమాలను ధరించి ఆటలయందు కదులాడుచున్న  రత్న కుండలాల కాంతితో ప్రకాశిస్తున్న చెక్కిళ్లతో శుక్లపక్షపు చవితి నాటి  చంద్రరేఖను  మరిపించు  చిరునగవుతో  రాధతో కూడియున్న ముగ్ధ మనోహరులగు గోపకాంతల నడుమ విలాసవంతుడై 

వెలిగిపోవుచున్నాడు 

 

ఒక గోపిక మోహ పారవశ్యం తో ఎగసిపడుతున్న తన ఎదను కృష్ణుని దేహానికి 

అదిమిపట్టి మిక్కిలి ప్రేమతో కృష్ణుని వేణుగానానికి అనుగుణంగా హెచ్చుస్వరంతో 

పంచమరాగం లో రాగాలాపన చేయుచున్నది 


 

విలాసవంతంగా అటునిటు త్రిప్పుతూ శృంగార సరసోల్లాస భావనలను పలికిస్తున్న కనులతో కూడిన

మదనుడిని జనిమ్పచేస్తున్న  కృష్ణుని ముఖసౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో నిశ్చేష్ట అయిన ఒక  ముగ్ధ  మదురమైన తేనెను చిందించు నవకమలం వంటి కృష్ణుని ముఖకమలాన్నే  ధ్యానిస్తూ   ఉండిపోయింది 

 

చక్కనైన పిరుదుల బరువుతో వేగంగా కదులజాలని ఒక యువతి ఏదో ఒక రహస్యాన్ని చెవిలో   చెప్పబోవు వంకతో కృష్ణుని ముఖారవిందానికి దగ్గరగా తన ముఖాన్నినిలిపి , తన ముఖపు   తాకిడికి గగుర్పాటునొందిన  కృష్ణుని బుగ్గలను చుంబించి తన ఆశను తెలివిగా  నెరవేర్చుకుంటున్నది 

 

ఒక పిల్ల కృష్ణునితో  కూడి జలక్రీడలయందు ఆసక్తితో  యమునానది తీరంలో ప్రబ్బ పొదరింటియందు    విహరిస్తున్న  శ్రీకృష్ణుని పట్టు వస్త్రాన్ని తన చేతితో పట్టుకుని లాగుచున్నది 



 

ఒక జవరాలు రాసక్రీడయందు కృష్ణునితో నృత్యము చేయుచు పాటకు తగినవిధంగా అరచేతులతో   తాళము వేయుచుండగా , ఆ కదలికలకు చేతి గాజులు చేయుచున్న సవ్వడి వేణునాదంతో  కలసి   మరింత  మదుర ధ్వనులను పలికించుచుండగా ఆ చిత్రమునకు కృష్ణుడు ఆమెను మంచి నేర్పరివే అని  ప్రశంసించుచున్నాడు 

 

ఆ కృష్ణుడు ఒక కోమలిని కౌగిలించుకునుచున్నాడు  ఒక చామంతిని చుమ్బించుచున్నాడు  ఒక  రమణీమణితో రమించుచున్నాడు చిరునగవులు చిన్దించుచున్న ఒక  చిత్రాంగిని  తదేకంగా   చూస్తున్నాడు ఒక మదవతి ముందు నడుచుచుండగా  కృష్ణుడామెను అనుసరించి పోవుచున్నాడు 

 

కీర్తిని కలిగించునది బృందావన సుందర వనములయందు పరమాత్ముని 

అధ్బుత  రహస్య క్రీడా విన్యాసాలను తెలియజేయునది అగు జయదేవుని సూక్తం 

మనకు  మంగళమును  కలిగించును 

 
 
చందన చర్చిత నీలకళేబర పీత వసన వనమాలీ 
కేళి చలన్మణికుండల మండిత గండయుగళ స్మితశాలీ 

హరిరిహ ముగ్ధ వధూనికరే  - విలాసిని విలసతి కేళిపరే 

 

పీన పయోధర భారభరేణ హరిం పరిరభ్య సరాగం 

గోపవధూ రను గాయతి కాచి దుదుఇజ్చత పంచమరాగం 

హరిరిహ…………
 
కాపి  విలాసవిలోలవిలోచన ఖేలన జనిత  మనోజం 
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదనసరోజం 
హరిరిహ…………
 

కాపి  కపోలతలే మిళితా లపితుం కామపి శ్రుతిమూలే 

కాపి చుచుమ్బ నితంబవతి దయితం పులకై రనుకూలే 

 హరిరిహ…………

 
కేళికళాకుతకేన చ కాచి దముం యమునాజలకూలే  
మంజులవంజులకుంజగతం  విచకర్ష కరేణ దుకూలే  

హరిరిహ…………

 
కరతల తాళతరళవలయావళి కలితకలస్వనవంశే 
రాసరసే సహనృత్య పరా హరిణా యువతి:  ప్రససంసే     

హరిరిహ…………

 
శ్లిష్యతి  కామపిచుమ్బతి కామపి రమయతి  కామపిరామా 
పశ్యతి సస్మిత చామపరా మనుగచ్చతి  వామామ్ 

హరిరిహ………… 

 
శ్రీ జయదేవ భణిత మిద  మద్భుత కేశవ  కేళి రహస్యం 
బృన్దావనవిపినే లలితం  వితనోతు  శుభానియసస్యం  

హరిరిహ………… 

Posted in Blogs.

Tagged with .

No comments



ఓ సరోజ పత్ర నేత్రా ..ఎర్ర తామరలను బోలిన

కోరి వరించిన భార్య తత్ఫల సంతానం సంపదలనే మూడు భంధనాలపై మదనుడి
మోహబాణపు తాకిడికి పెంచుకున్న వ్యామోహంతో
జనన , జీవన మరణాలనే మూడు సరస్సులలో పలుమార్లు
మునకలేస్తున్న నాకు ముకుందా నీ భక్తి అనే పడవలో
కొద్ది చోటు కల్పించు

ముకుందా! నీ కడగంటి చూపు తో
పృథ్వి ధూళి రేణువు సమమవ్వును
అనంత జలధి ఒక్క బిందు పరిమాణమయ్యే
బడబాగ్ని చిన్న అగ్నికణం గా గోచరిస్తుంది
ప్రచండమైన వాయువు చిరుగాలి లా ఆహ్లాదపరుస్తుంది
అంచులేరుగని ఆకాశం చిన్న రంధ్రమై చిక్కపడుతుంది
సమస్త దేవతా సమూహం బృంగ సమూహాలను మరిపిస్తుంది
కృష్ణా సమస్తము నీ పాద ధూళి
లోనే ఇమిడియున్నది కదా


యాజ్ఞావల్క్యాది మహర్షులచే తెలియజేయబడిన
జరా వ్యాధి మరణాల నుండి ముక్తి కలిగించు
దివ్యోషధం జనులారా మన హృదయాలలో అంతర్జ్యోతి
వలె , కృష్ణ నామం తో ఒప్పారుచున్నది . ఆ నామామృతాన్ని
త్రావి పరమపదం పొందుదాం

దురదృష్టమనే అలలతో కూడిన సంసార సాగరంలో
అటునిటు త్రోయబడుచున్న నరులార! చిరుమాట వినండి
జ్ఞానఫలం కోసం నిష్ఫల యత్నాలు వీడి
ఓం నారాయణా నామజపం తో ముకుందుని పాదాల మోకరిల్లండి

ఎంత అవివేకులము సుమీ !
పురుషోత్తముడు ముల్లోకాలకు అధిపతి
శ్వాసను నియంత్రించిన మాత్రాన అధినుడగునట్టివాడు
స్వయంగా మన చెంతకు రానుండగా ,
తనవన్ని మనకు పంచనుండగా
అధములైనట్టి రాజులను యజమానులను
అల్పమైన కోర్కెల కోసం ఆశ్రయించుచున్నాము


ముకుళిత హస్తాలతో వినమ్రతతో వంగిన శిరస్సుతో
రోమాంచిత దేహంతో గద్గద స్వరంతో కృష్ణ నామాన్ని
పదే పదే స్మరిద్దాం సజల నేత్రాలతో నారాయణుని వేడుకుందాం

ఓ సరోజ పత్ర నేత్రా ..ఎర్ర తామరలను బోలిన నీ పాదద్వయం నుండి

జాలువారు అమృతం సేవించుచు మా జీవనం కొనసాగించు భాగ్యం కలిగించు
(ముకుంద మాల)

Posted in Blogs.

2 comments



ఆగు ..నన్ను వెంబడించకు

ఆగు ..నన్ను వెంబడించకు

మనసా తుళ్ళి పడకే ..

అతిగా ఆశ పడకే .

ధర్మం మీరి ప్రవర్తించకే

ఎన్నిసార్లు నచ్చచెప్ప ప్రయత్నించిన వినకున్నది మనసు

అది మన మాట వింటే మనకిన్ని సమస్యలెందుకు

అయినా మనం మాత్రం .మన అంతరాత్మ ఘోషిస్తూనే వుంటుంది

వలదు వలదని మన బుద్ది వింటుందా

మరి నిలకడలేని మన బుద్ది సలహా మనసెలా వింటుంది .

అంతరాత్మ రూపంలో ఆ పరమాత్మ చెప్పేదానినే పెడచెవిన పెడుతున్నాం

అందుకే ఇన్ని సమస్యల సహవాసం మనకు లభిస్తుంది

మన బుద్దిని ప్రక్కదారి పట్టించే వాటినే ముద్దుగా అరిషడ్వర్గాలు అంటాం

వాటన్నిటికి రారాజు .మోహం

ఇదే అన్నిటికి మూలం .

దీనికి ..కామం అనేది మంత్రి

క్రోధం .సేనాధిపతి

లోభ మద మాత్సర్యాలు సైనికుల్లాంటివి

అందుకే దేనిపైన కూడా మోహం వ్యామోహం కూడదని పెద్దలు సుద్దులు చెబుతారు

అలా వ్యామోహం లేని స్థితినే నిర్వికారం అంటాం . అది యోగుల స్థితి . మనకు చెల్లుబాటు కాదు

మరి మనం ఏమి చేయాలి

మన మోహాన్ని కనీసపు స్తాయికి తగ్గించుకోవతానికైనా ప్రయత్నించాలి

లేదా దానిని సక్రమ మార్గంలోకన్న మళ్ళించాలి

అనవచ్చు ..అందరు నిర్వికారం గా వుంటే సమాజం ఎలా నడుస్తుందని

శుబ్రం గా నడుస్తుంది . నిర్వికారమంటే ఎ పని చేయకుండా నీరసించి వుండటం కాదు

అన్ని పనులు చేసుకుంటూనే దేనిపైన వ్యామోహం లేకుండా వుండటం .

అలాంటి వారే ఆనందం చవి చూడగలరు

ఏమో ఇవన్ని చెప్పుకోవటానికి బాగానే వుంటాయి . ఆచరించటం

బహు కష్టం

ఓ వ్యామోహమా ఆగు నన్ను వెంబడించకు

హే కృష్ణా

ఈ గోలంతా నాకెందుకు

నన్ను వీడని నా మనసును కల్లోలం చేస్తున్న ఈ మోహపు సుడిగుండం

దారి మళ్ళించు

లౌకిక విషయాల పట్ల , కృశించి నశించి పోయే సౌందర్యాల పట్ల

తీయని అనుబంధాల పట్ల నాకున్న వ్యామోహాన్ని నీ వైపుకు మళ్ళించు

ఓ గోవిందా

జనన మరణ సమయాల్లో నాతోడు రాని , ఆ రెంటి నడుమ కాలం లో అందీ అందక అందుబాటు లోకి రాని , మనసుకు శాంతి నోసగని సంపదలపై నాకున్న వ్యామోహం తొలగించు

ఎల్లప్పుడూ నీ హృదయం పై నిలిచి వుండే వెల లేని సంపద శ్రీవత్స చిహ్నం పై

నాకు ఎనలేని వ్యామోహం కలిగించు

ఓ గోవర్ధన గిరిధారి

రక్త మాంసాలతో కూడి , నానావిధ మలభుయిష్టమైన శరీరాల పట్ల వ్యామోహం తొలగించు

మన్మధుడిని దగ్ధం చేసిన ముక్కంటి కే మదనతాపం కలిగించిన

సత్యము నిత్యమూ అయిన నీ రూప లావణ్యాల పట్ల వ్యామోహం కలిగించు

ఓ యశోద నందనా

తొలుత ఆనందాన్ని తుదకు విచారాన్ని మాత్రమే మిగిల్చే అనుబంధాల

భంధనాలపై వ్యామోహం తొలగించు

ఎంత గ్రోలినా తనవి తీరని మకరందామృతం వంటి నీ లీలా విన్యాసాల

గాధల పట్ల ఎడతెగని వ్యామోహం కలిగించు

నా మోహం ..వ్యామోహం అంతా నీపైనే కృష్ణా

Posted in Blogs.

1 comment



తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం వోలె

కృష్ణా ! నా మనసనే సరోవరంలో
రాజహంసవలె విహరించు . ప్రాణ దీపం

కోడగడుతున్నవేళ కఫావాత పిత్తాలతో

నిండిన జ్ఞానేంద్రియాలు నిన్నెలా తలచగలవు

కనుక ఇప్పటినుండే నీ పాద పద్మాలను

నా హృదయంలో నిల్పెద

తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం వోలె
మా మనస్సులను రంజింపజేయు మందస్మిత వదనార విందా
పరమ సత్యమైనట్టివాడ నంద గోప తనయా నారదాది

మునింద్రులచే కీర్తించబడు హరీ ఎల్లప్పుడూ నిన్నే తలచెదను

నీ కర చరణాలనే పద్మాలతో నిండి

చల్లని వెన్నల బోలు చూపులను ప్రసరించు నీ

చక్షువులే చేప పిల్లలుగా కల హరిరూపమనే

సరోవరం లో కొద్ది జలాన్ని త్రాగి జీవనయానపు

బడలిక నుండి పూర్తిగా సేద తీరెదను

కలువ పూల వంటి కనులతో , శంఖు చక్రాల తో

విరాజిల్లు మురారి స్మరణ ఓ మనసా ! ఎన్నటికి

మరువకు అమృతతుల్యమగు హరి పాద పద్మాలను

తలచుటకన్నను తీయని తలంపు మరి లేదు కదా

ఓ అవివేకపూరితమైన మనసా ! నీ స్వామి శ్రీధరుడు చెంత నుండగా

మృత్యువు గూర్చి నీవొనరించిన పాపకర్మల ఫలితాన్ని గూర్చిన చింత ఏల ?.

ఇంకను ఆలస్యమేల? తొందరపడు అత్యంత సులభుడైన నారాయణుని
పాదాలను నీ భక్తి తో బంధించు నీ బంధనాలు తెంచుకో

జనన మరణాలనే రెండు ఒడ్డుల కూడిన సాగరం లో

వచ్చిపోయే కెరటాల వలె నానా జన్మల పాలై

రాగ ద్వేషాలనే సుడిగుండంలో చిక్కుకుని

భార్యా పుత్రులు , సంపదలనే వ్యామోహపు మకరాల

కోరలకు చిక్కి చితికిపోతున్న నాకు మత్స్యరూపధారి హరీ నీవే దిక్కు .

దాటశక్యం కాని సంసార సాగరం చూసి

దిగులు చెందకు ఆందోళన విడుము

నిర్మల ఏకాగ్రచిత్తంతో ధ్యానించు

నరకాసుర సంహారి నావలా మారి నిన్నావలి తీరం చేర్చగలడు

(ముకుంద మాల లోని తదుపరి ఆరు పూలు రామచందేర్ ఆంగ్ల అనువాద సాయంతో )

Posted in Blogs.

2 comments



mukunda mala

ఓ ముకుందా
శ్రీవల్లభ వరదా భక్తప్రియా దయాసాగరా

నాధా , జగన్నివాసా , శేషశయనా

ప్రతి దినం అమృతమయమైన ని నామాలను

స్మరించు వివేచన కలిగించు

దేవకీనందన దేవాధిదేవ జయము జయము

వృష్టి వంశ ప్రదీప జయము జయము

నీల మేఘశ్యామ జయము జయము

ధర్మ రక్షక జయము జయము

ఓ ముకుందా

శిరము వంచి ప్రణమిల్లి మిమ్ములను యాచిస్తున్నాను

నా రాబోవు జన్మలెట్టివైనను మి పాద పద్మములను

మరువకుండునటుల మి దయావర్షం నాపై అనుగ్రహించుము

ఓ హరి !

కుంభిపాక నరకములనుండి , జీవితపు ద్వంద్వముల నుండి

రక్షించమనో ,

మృదువైన లతల వంటి శరీరంతో కూడిన రమణీమణుల పొందుకోరి

నిన్ను ఆశ్రయించలేదు

చావు పుట్టుకల చక్రబంధం లో చిక్కుకున్న నా మదిలో

జన్మ జన్మకు ని పాదపద్మములు స్థిరంగా వుండునట్లు

అనుగ్రహించుము చాలు

ఓ దేవాధి దేవా !

నేనెంత నిరాసక్తుడైనప్పటికి పూర్వ కర్మల వాసనా బలం చేత

ధర్మాచరణ , భోగ భాగ్యాల అనురక్తి నను విడకున్నవి

కాని నేను నిన్ను కోరే గొప్పదైన వరం ఒక్కటే , జన్మ జన్మలకు

కూడా ని చరణారవిన్దాలు సేవించుకునే భాగ్యం కల్పించు .

ఓ నరకాసుర సంహార !

దివి , భువి లేక నరకం నీవు నాకు ప్రసాదించే

నివాసమేదైనప్పటికిని , మరణ సమయంలో

శరత్కాలపు నిర్మల సరోవరంలో వికసించిన

నవ కమలములవంటి ని పాదములు నా మనో నేత్రంలో నిలుపు చాలు

మహా జ్ఞాని , భక్తి సామ్రాజ్యపు మహారాజు చేర (కేరళ) సామ్రాజ్యాదీసుడు కులశేఖర ఆళ్వార్ ముకుందునకు సమర్పించిన పూమాల లోని మొదటి ఆరు పూలకు భక్తి వేదాంత స్వామి వ్రాసిన ఆంగ్ల అనువాద ఆధారంగా

Posted in Blogs.

3 comments



NENU GITA

నేను గీత

ఎవరా గీత ఏమా గాధ

పక్కింటి అమ్మాయో లేక మరొకరో కాదు

మన రాత మార్చేందుకు భగవానుడు చెప్పిన గీత

అదే భగవద్ గీత

చిన్నప్పటి నుండి వింటూనే వున్నాం .ఘంటసాల గళమాదుర్యం లో గీతను

కాని దానిని అధ్యయనం చేసి ఫలం పొందగలిగినది మాత్రం ఆరేడు సంవత్సరాల

క్రితం

ఎప్పటిలానే తెల్లవారినా , పొద్దు మాత్రం అనుకోని రీతిలో గ్రున్కింది

మన అనుకున్న వారి నుండి ఎదురైన వూహించని పరాభవం

మనసును మెలి తిప్పుతుంటే

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే అని విషాద గీతం

పాడుకుంటూ గది తలుపులు బిగించుకుని మనసు తలపులు తెరచి

విలపించెంతలో

గూటిలో ఎప్పుడో కొనిపడేసిన భగవద్ గీత ఓరి అమాయకుడా

నన్ను చూడరా అని పిలుస్తున్నట్లున్నది

చేతిలోకి తీసుకుని పేజి త్రిప్పగానే అర్జున విషాదయోగం .

అది చూసి విషాదం గా నవ్వుకుంటూ చదవటం మొదలెట్టాను

కాలం గడుస్తున్నది .అర్ధం చేసుకునే కొద్ది మోహపు

మాయ వీడి జీవితపు మర్మం తెలియరాసాగింది

దానితో పాటే గుండెల్లో గూడు కట్టిన భాద ఆవిరైపోసాగింది

చివరకు మిగిలింది

అందమే ఆనందం

ఆనందమే జీవిత మకరందం

అంతలా నన్ను ప్రభావితం చేసిన భగవద్ గీత నేడు ఎంతలా నాతొ కలసిపోయిందంటే

ఎక్కడైతే తొలి విషాదాన్ని చవి చూసానో తిరిగి అక్కడే మరో ఇబ్బందికరమైన వార్త

వినరావల్సివచ్చింది .

విశేషం .అప్పుడు ఇప్పుడు కార్తిక మాసమే

గురు దశ మొదలవుతున్నదని , గురువు యొక్క శాపానికి గురి అయ్యానని , ఇది 18 సంవత్సరాలు కొనసాగుతుందని , ఉపసమించటానికి వైడూర్యము , కనక పుష్యరాగము ధరించమని దాని సారాంశం

మళ్ళి మొదలు ..అర్జున విషాదయోగం

మనసును మధిస్తే చివరకు దక్కిన సమాధానం ..

నా పుట్టిన రోజు 18

భగవద్గీత లో అధ్యాయాలు ..18

అ కురుక్షేత్రం జరిగినది ..18

ఈ గురుదశ నన్ను వెన్నంటి వుండే సంవత్సరాలు 18

మనస్సనే కురుక్షేత్రం లో మంచి చెడుల మద్య జరిగే పోరాటం లో

ధర్మాన్ని ఆలంబనగా చేసుకోమని , అందుకు తన పాద పద్మాలను

ఆశ్రయించమని , గురు శాపమనే వంకతో భగవానుడు నాకు అనుక్షణం

తెలియచేస్తున్నట్లు లేదూ

కంసుడు ప్రాణ భయంతో ఎక్కడ చూసిన కృష్ణుడిని కాంచినట్లు , ప్రతి

పనిని ఆరంభించబోయేముందు , తన పాద పద్మాలను ఆశ్రయించమని

గురు శాపమనే నెపం తో కృష్ణుడు నాకు తెలియచేస్తున్నాడు

గీత లో ఆయనే స్వయం గా పేర్కొన్నాడు గురువులలో దేవగురువు బృహస్పతి

తానేనని . అట్టి నారాయణుని చే ఇవ్వబడిన శాపం నా పాలి వరం కావటం లో

వింతేమున్నది .

అన్నమాచార్యుల వారు కిర్తించినట్లు

శంఖ చక్రాల నడుమ సందుల వైడూర్యమై తానుండగా

కాళిన్దుని తలలపై కప్పిన పుష్యరాగమై తాను ప్రకాసిస్తుండగా

ఇక వేరే రాళ్ళు రత్నాలతో నాకు పని ఏమి

ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన భగవద్గీతకు వందనాలతో

Posted in Blogs.

1 comment



krishna soundayam

నల్లని పొడుగైన ఉంగరాలు తిరిగిన ఆ చిన్ని కృష్ణుని
కేశాలు తల్లి యశోదకు నయనానందకరం కాగా

వాటిని నెమలి పింఛం తోను , సువాసనలు వేదజల్లేదు పూలతోను

అలంకరించి మురిసిపోతున్నది

నవమి నాటి చంద్రుని పోలిన విశాలమైన కృష్ణుని ఫాల భాగం

బ్రమరాలను ఆకర్షింపచేయుచున్న పూల వలె , చిరుగాలికి నుదుటి పైకి జారిన

ముంగురులతో గోపికలకు ముద్దుగొల్పుచున్నది .

కృష్ణుని అధరామృతాన్ని నింపుకున్న వేణు గానం సమస్త జీవకోటికి

చైతన్యం కలిగిస్తున్నది

లలితా లావణ్యమైన కృష్ణుని ముఖారవిందం గోపికల మనస్సులను

మదనుని వలపు బాణాల తాకిడికి చలించిపోతున్న ప్రేమికుల మనోరధం

వలె విచలితం చేస్తున్నది

మురళీవిలాస ముగ్ధ ముఖామ్బుజంతో విరాజిల్లు చిన్ని కృష్ణుని

ముఖ సౌందర్యాన్ని వీక్షిస్తూ ముల్లోకాలు కూడా అద్బుత ఆశ్చర్యాలకు

లోనవుతున్నాయి

ఎర్రని దొందపండ్ల వంటి లేత పెదవులపై మురళి ని అటునిటు విలాసంగా తిప్పుతూ

విశాలమైన విలోచనాలలో మదుర భావనలు పలికిస్తూ గోపికలతో ముచ్చటిస్తున్న

తీరును చూసి పరవసులవని వారెవరైనా వుంటారా

అట్టి కృష్ణుని సౌందర్యాన్ని చూడజాలని కనులు నెమలి పించముపై అందంగా తీర్చబడిన కనులవలె ఎంత సుందరములైనప్పటికి వ్యర్ధములే కదా

Posted in Blogs.

2 comments



venna donga

ఓ యమ్మ ! ని కుమారుడు ,
మా యిండ్లను బాలు బెరుగు మననీడమ్మ !

పోయెద మెక్కడికైనను ,

మా యన్నల సురభులాన మంజులవాణి !

ఓ మంజులవాణి ! మీ పిల్లవాని ఆగడాలు మితి మిరిపోతున్నాయి

మా అన్న నందుని గోవుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం

వేరేచటికైనను వెళ్లిపోతాము అని గోపికలు మొర పెట్టుకున్నారు

యశోదమ్మతో

చన్ను విడిచి చనుదిట్టటు

నెన్నడు బోరుగిండ్ల త్రోవ నెరుగడు నేడుం

గన్నులు దెరవని మా యి

చిన్న కుమారకుని రవ్వ సేయమ్దగునే

ఎల్లప్పుడూ నా ఒడిలో నే వుంటూ పాలు త్రగాటమే తప్ప

ఇరుగు పొరుగిండ్ల త్రోవ కూడా తెలియని నా చిన్ని కృష్ణుని మీద

ఇన్ని అభాండాలు వేస్తారా అంటూ ఆ యశోద వారిని కేకలు వేస్తుంది

ఇది మనకు రోజు నిత్యకృత్యమే కదా ..పిల్లలు అల్లరి చేయటం

ఇరుగు పొరుగు అమ్మలక్కలు పంచాయితీకి వస్తే వారి మీదే మనం

అరవటం

కాని సమస్త లోకాలకు పోషకుడైన ఆ చిద్విలాసముర్తికి

పేద గోపకుల ఇండ్ల లో దూరి కుండలు పగులగొట్టి వెన్న దొంగలించాల్సిన

అవసరమేమిటి

తరచి చూస్తే తత్వం భోదపడుతుంది

ఇక్కడ కుండ ను మన దేహం తో పోల్చుకోవచ్చు

కుండ తయారు కావటానికి మట్టి , నీరు , అగ్ని , గాలి అవసరం అలాగే కుండ

లోపలి భాగం శూన్యం తో వుంటుంది

మన శరీరం కూడా అవే ధాతువులతో నిర్మించబడుతుంది

కుండ పగిలి మట్టిలో కలసినట్లే ఈ శరీరం పగిలి చివరకు ఆ మట్టిలోనే కలసిపోతుంది

ఇక కుండలోని వెన్నను మన మనసుతో పోల్చుకోవచ్చు

వెన్న ప్రధానం గా మూడు లక్షణాలు కలిగి వుంటుంది

అవి తెలుపుదనం , మృదుత్వం , మదురత్వం

మనసు మూడు గుణాలను కలిగి వుంటుంది . అవి సత్వ , రాజ తామస గుణాలు

సత్వగుణం తెలుపు రంగును కలిగి వుంటుంది . శాంతం , సత్ప్రవర్తన , సాదు స్వభావం

ఇవన్ని సత్వగుణం లక్షణాలు

అందుకే తెలుపును శాంతికి చిహ్నం గా వాడతాం

అలాగే మృదుత్వం మ్రుదుత్వమంటే తేలికగా కరిగిపోయే స్వభావం

అది దయా గుణానికి చిహ్నం . ఇతరుల సమస్యలను తమవిగా భావించి

వారి కష్టాలను చూసి కరిగి వారికి సహాయం చేయటానికి సిద్దపడటం

ఇక వెన్న యొక్క చివరి గుణం పరిమళత్వం తో కూడిన మదురమైన రుచి

అది మనిషి యొక్క మాట తీరుతో పోల్చవచ్చు మనం ఎల్లప్పుడూ

చక్కని మాట తీరు కలిగి , ఇతరులను నొప్పించక వుంటే మనకు అనేక

స్నేహ సమూహాలు ఏర్పడతాయి

అట్టి వారి హృదయాలలో ఆ హృషీకేశుడు కొలువై వుంటాడు

అట్టి మనసున్న వారు కనుకనే గోపికల మనస్సులను దోచుకున్నాడు

ఆ మానసచోరుడు

మరి మనం కూడా మన మనస్సులను నవనీతం చేసి ఆ వెన్న దొంగకు

దోచిపెడదామా

Posted in Blogs.

2 comments



megha sandesam

ఆకాశా దేశాన అనంతకాలపు పయనం సాగించే ఓ మేఘమాలిక

కనుగొని విన్నవించు నా ప్రియ సఖి కి
నా మేఘ సందేశం

ఘడియ ఘడియ శిలగా మారి కరగకున్నది బంతి
ఎద కోవెలలో ని మూర్తి తిష్టవేసినది బంతి

తెల్లవారు తరుణాన ని ముఖ కమలం
చిరునవ్వుల రెక్కలతో విప్పారుతున్నది బంతి
నాలో నవచైతన్యం నింపుతున్నది బంతి

అపరాహ్ణవేళ ని తలంపే అమృత తోయమై
ఆకలి తీర్చుచున్నది బంతి
నాలో నవచైతన్యం నింపుతున్నది బంతి

చీకటి పడిన వేళ కలువబాల ను మరిపించు ని
పసిడి మేని సోయగం విరహతాపం పెంచుతున్నది బంతి
నాలో నవచైతన్యం నింపుతున్నది బంతి

ఓ మేఘ మాలికా నా ముద్దుల బంతి
గురుతు తెల్పెద .జాడ పట్టుకో

ఎ ఇంట అనురాగవర్షం కురుస్తున్నదో
ఎక్కడ ఆనందం వెల్లివిరుస్తుందో
ఎక్కడ ఆప్యాయత పొంగిపోరలుతుందో
ఎక్కడ మమతల మణిదీపమ్ వెలుగులు విరజిమ్ముతుందో
అదే అదే నా ముద్దుల బంతి చరించు తావు

Posted in Blogs.

1 comment



banthi

బంతి ఓ ముద్దబంతి

రవివర్మకే అందని

నా మనసు కు అందిన ఒకే ఒక అందానివో

రవి చూడని

నే కాంచిన కాంచన శిల్పానివో

బ్రమరం చేరని

నా చూపులు తాకిన పుష్ప మాలికవో

ఎవరివో నీవెవరివో

దివిలోని తారకవో

భువి పైని పూబాలికవో

సాగరమందున స్వాతిముత్యానివో

సమిరంలో సుగంధాలు నింపు సన్నజాజివో

ఆకాశాన సప్తవర్ణాల హరివిల్లువో

అచలాగ్రాన ప్రకాశించు రత్న రాశివో

తూరుపు దిక్కున అరుణారుణిమ వర్ణానివో

పడమటి సంద్యారాగానివో

కవి హృదయాన కావ్య కన్యకవో

చిత్రకారుడి కుంచెలో ఒదిగిన సజీవ సౌందర్య మూర్తివో

నివెవరైతేనేం

నిన్ను ప్రేమించటం మాత్రమే తెలిసిన ఈ సామాన్యుడి

గుండె చప్పుడు నీవు

ఆలోచనల ఆది నీవు

ఆనందాల ప్రోది నీవు

ఊపిరి నీవు

బంతి ఓ ముద్దబంతి

నిజం నీవు
నీడను నేను

Posted in Blogs.

2 comments