Skip to content


krishna soundayam

నల్లని పొడుగైన ఉంగరాలు తిరిగిన ఆ చిన్ని కృష్ణుని
కేశాలు తల్లి యశోదకు నయనానందకరం కాగా

వాటిని నెమలి పింఛం తోను , సువాసనలు వేదజల్లేదు పూలతోను

అలంకరించి మురిసిపోతున్నది

నవమి నాటి చంద్రుని పోలిన విశాలమైన కృష్ణుని ఫాల భాగం

బ్రమరాలను ఆకర్షింపచేయుచున్న పూల వలె , చిరుగాలికి నుదుటి పైకి జారిన

ముంగురులతో గోపికలకు ముద్దుగొల్పుచున్నది .

కృష్ణుని అధరామృతాన్ని నింపుకున్న వేణు గానం సమస్త జీవకోటికి

చైతన్యం కలిగిస్తున్నది

లలితా లావణ్యమైన కృష్ణుని ముఖారవిందం గోపికల మనస్సులను

మదనుని వలపు బాణాల తాకిడికి చలించిపోతున్న ప్రేమికుల మనోరధం

వలె విచలితం చేస్తున్నది

మురళీవిలాస ముగ్ధ ముఖామ్బుజంతో విరాజిల్లు చిన్ని కృష్ణుని

ముఖ సౌందర్యాన్ని వీక్షిస్తూ ముల్లోకాలు కూడా అద్బుత ఆశ్చర్యాలకు

లోనవుతున్నాయి

ఎర్రని దొందపండ్ల వంటి లేత పెదవులపై మురళి ని అటునిటు విలాసంగా తిప్పుతూ

విశాలమైన విలోచనాలలో మదుర భావనలు పలికిస్తూ గోపికలతో ముచ్చటిస్తున్న

తీరును చూసి పరవసులవని వారెవరైనా వుంటారా

అట్టి కృష్ణుని సౌందర్యాన్ని చూడజాలని కనులు నెమలి పించముపై అందంగా తీర్చబడిన కనులవలె ఎంత సుందరములైనప్పటికి వ్యర్ధములే కదా

Posted in Blogs.



2 Responses

Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.

  1. diya bharadwaj says

    its really very nice and krishnudu ante andariki mundu gurthochede gopikalu,yashoda,and e.t.c.ur post is wonderful.and i hope u will post a comment in mynew blog cynderella.

  2. jayasri ranganathan says

    krishnuni andam choosi paravasinchani vaallu evaraina untara?chaala chekkaga undi kiran.