01 Sep 2010 @ 3:18 PM 

శీర్షిక పేరు చూడగానే ఇదేదో నా ఆత్మ కధ అనుకుంటున్నారేమో? ఆదేం లేదండీ. ఇది మన అందరిలో ఉన్న ఆత్మ గురించే. మనలో చాలా మందికి మన వేద శాస్త్రాలు మొదలైనవి పాత వాళ్ళు చెప్పిన సోదిలా అనిపించ వచ్చు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. నాకు తెలిసి అన్నిట్లో ముఖ్య కారణం వాటిపై మనకి సరి ఐన అవగాహన లేక పోవటమే అనిపిస్తుంది. సంస్కృతం ఉన్న ఆ శ్లోకాలని అర్థం చేసుకోవటానికి మనకు సంస్కృతంలో పరిపూర్ణ ఙ్ఞానం కావాలి. ఈ సంగతి వదిలి ఈ వ్యాసం అస్సలు విషయానికి వద్దాము.

         మనకి పెద్దలు చెప్పినది, చదివినది బట్టి ఆత్మ గురించి కొద్దో గొప్పో తెలుసు. ఐతే అందులో మనకి పరిపూర్ణ ఙ్ఞానం లేదు. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇక్కడ పొందు పరుస్తున్న.

         అస్సలు ఆత్మ అంటె ఏమిటి? ఆత్మ గుణం ఏమిటి? మనము ఎలా తెలుసుకోగలము అనే విషయాలని మన పూర్వులు ఉపనిషత్తులలో కూలంకుషం గా చర్చించారు.


అవినాశి తు తద్విద్ధి యేన సర్వ మిదం తతం
వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్క ర్తు మర్హతి.
         “శరీరము నందంటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిది. వినాశము లేని ఆత్మను చంప గలిగిన వాడెవ్వడునూ లేడు” (భగవద్గీత- సాంఖ్యా యోగం -17 ).

         ఆత్మ మనుస్యుని శరీరం అంతట వ్యాపించి ఉంటుంది అని, ఈ ఆత్మ వలనే మనలో చైతన్యము ఉంది అనే విషయము భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఐతే ఈ ఆత్మ ని మనము చూడగలమా? చూడలేకపోతే ఉంది అని ఎలా నిర్ధారించ గలమూ? అస్సలు ఆత్మ ఎక్కడ ఉంది?

         ఆత్మ మన కంటికి కనిపించనంత సూక్షం రూపంలో ఉంటుంది. దాని పరిమాణం గురించి శ్వేతాశ్వతరోపనిషత్తులో (5,9) ఈ విధం గా చెప్ప బడింది.


బాలాగ్ర శత భాగస్య శతధా కల్పితస్య చ
భాగో జీవ స్స విఙ్ఞేయః స చానంత్యాయ కల్పతే
         “వెంట్రుక యొక్క చివరిభాగమును నూరు తునకలుగా చేసి అందులో ఒక్కొక్క తునుకను మరల నూరు భాగములుగా చేసినచో అందులోని ఒక్కొక్క తునుక ఎంత పరిమాణముగల్గి ఉండునో అంతటి పరిమాణము గలది ఆత్మ.”
ఇదే విషయం భాగవతం లో ఈ విధం గా చెప్పబడింది.


కేశాగ్ర శతభాగస్య శతాంశస్సదృశాత్మకః
జీవః సూక్ష్మ స్వరూపో అయం సంఖ్యాతీతో హి చిత్కణః
         “ఆత్మ కణములు అసంఖ్యాకములు. అవి కేశాగ్రముయొక్క శతాంశ భాగ పరిమాణము గల్గి యున్నవి”

         ఇంత సూక్ష్మ రూపంలో ఉన్న ఆత్మని మనము సామాన్యమైన కళ్ళతో చూడలేము కదా. మాండూకోపనిషత్తులో ఏమన్నారో చూద్దాం.


ఏషోఆణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణాః పంచధా సంవివేశ
ప్రణైశ్చిత్తం సర్వనోతం ప్రజానాం యస్మిన్ విశుధ్ధే విభవత్యేష ఆత్మా
         “ఆత్మ పరమాణు మాత్రమైనది. దానిని భుధితోనే తెలుసుకోదగును. ఈ పరమాణు ప్రమాణమైన ఆత్మ పంచవిధ వాయువులతో (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన) ప్రవహితమై ప్రాణుల హృదయముల నుండి తన ప్రభావమును శరీర మంతటను వ్యాపింప చేయు చుండును. ఈ పంచవిధములైన భౌతిక వాయువులు కల్మషమును వదిలినప్పుడు ఆత్మ పునీతమై తన దివ్య ప్రభావమును ప్రకటించును”

         దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటి అంటే ఆత్మ మన హృదయం లో ఉంటుంది అని. హ్రుదయం లో ఆత్మ స్థానం మంత్రపుష్పంలో చక్కగ వివరించారు.

         ఈ వివరణ ప్రకారం మనహృదయము నందు అతి సూక్ష్మమైన రంధ్రమొకటి కలదు. ఆ రంధ్రమునందలి మధ్య భాగమున అనంతమగు జ్వాలలతో కూడిన ఒక అగ్ని కలదు. ఈ మహా అగ్ని మధ్యమునందు మరొక విషిష్టగ్ని కలదు. ఈ విషిస్టాగ్ని యందే దేవుడు నివసించుచున్నాడు.

         బహుశా ఇదే ఆత్మ స్థానం అయ్యి ఉండవచ్చు. భగవద్గీతలో చెప్పిన విధం గా ఆత్మకు జనన మరణాములు లేవు. ఎప్పటికీకి మార్పు చెందదు. శాశ్వితమైనది. ఇది ఒక శరీరము వదిలి ఇంకొక శరిరమును ఆశ్రయించునే కానీ శరీరముతో పాటు నాశనము కాదు. ఈ ఆత్మను ఏ ఆయుధములు ఖడింపలేవు. అగ్ని దహించలేదు. నీరు తడి చేయలేదు. గాలి శుష్కింప చేయలేదు.
ఇవన్ని చదువుతుంటె నాకు భౌతిక శాస్త్రంలో చదువుకున్న విషయాలు గుర్తుకు వస్తున్నాయి. మనము పరమాణువు గురించి వాని అంతర్గత విషయాలను దురించి చదువుకున్నవే. పరమాణు భౌతిక శస్త్ర (Atomic Physics) ప్రకారం ఎలక్ట్రానులు ప్రోటానులు కలిగిన పరమాణువును ఇంకా విభజించితే చవరికి మిగిలేది శక్తి (energy) మాత్రమే . మనము కొంచము నిశితం గా గమనిస్తే ఆత్మ అనే మన వైదిక సిద్ధాంతము పరమాణు సిద్ధాంతముకి చాలా పోలికలే కనిపిస్తాయి.

         ఇది నా ఆలోచన మాత్రమే. మీరూ ఆలోచించండి మరి.


Tags Tags: , ,
Categories: Telugu Posts
Posted By: D Subrahmanyam
Last Edit: 01 Sep 2010 @ 03 18 PM

EmailPermalinkComments (0)

 29 Mar 2010 @ 9:40 AM 

కర్నాటక సంగీతంలో అనేక జనరంజకమైన రాగలున్నాయి. శంకరాభరణం, కల్యాణి, ఆనందభైరవి, హిందోళం, మోహనం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిష్టే తయారవుతుంది. ఐతే ఇక్కడ నేను చెప్పదలచు కున్నది ఒకేఒక్క రాగం గురించి- అది ” మోహన రాగం”. అదే ఎందుకు అని మీరు అడగవచ్చు. చదవండి. మీకే అర్ధమవుతుంది.

        సంగీత పరంగా మోహన రాగం:

        కర్నాటక, హిందుస్థానీ సంగీతంలో మోహన రాగానికి విశిష్ట స్థానం ఉంది. ఎంతో మంది వాగ్గేయకారులు ఈ రాగంలో ఎన్నో అద్భుతమైన రచనలు చేసారు. కారణం ఈ రాగం అన్ని వేళలా పాడ దగినది, నవరసాలను పలికించగలది కావటమే. సంగీతం తెలిసిన వారినైనా, తెలియని వారినైనా ఒకేలా ఆకట్టుకునే రాగం మోహన రాగం.

        మోహన రాగం 28 మేళకర్త అయిన హరికాంభోజి అనే రాగానికి జన్యం. ఔఢవ-ఔఢవ రాగం. అంటే ఈ రాగం ఆరోహణ, అవరోహణలో కూడా కేవలం ఐదు స్వరాలే ఉంటాయి. అవి…


1. షడ్జమం (స)
2. చతుశృతి రిషభం (చ. రి)
3. అంతర గాంధారం (అం.గ)
4. పంచమం (ప)
5. చతుశృతి ధైవతం (చ.ద)
        అంటే స, రి, గ, ప, ద, స - స, ద, ప, గ, రి, స అనేది ఈ రాగం ఆరోహణ అవరోహణలన్న మాట. సంగీతం నేర్చుకునేప్పుడు వచ్చేగీతాలలో “వరవీణ మృదుపాణి” అనే గీతం చాలా మందికి తెలిసిందే. ఇది మోహన రాగంలోని గీతమే.

        కర్నాటక సంగీతంలో మోహన రాగంలో వచ్చిన కొన్ని ప్రసిద్ధ రచనలు:

1. నిన్ను కోరి (వర్ణం)
2. ననూ పాలింప (త్యాగరాజ కృతి)
3. ఎవరూరా నిను వినా (త్యాగరాజ కృతి)
3. బాల గోపాల ( నారాయణ తీర్ధులవారి తరంగం)
4. రక్త గణపతిం భజేహం (ముత్తుస్వామి దీక్షితార్ కృతి)
5. చందన చర్చిత (గీతాగోవిందం-జయదేవ)
6. రతి సుఖసారే (గీతాగోవిందం-జయదేవ)
7. రామా నిను నమ్మిన వారము (త్యాగరాజ కృతి)
8. మాటిమాటికి తెల్పవలెనా (త్యాగరాజ కృతి)
9. భవనుత (త్యాగరాజ కృతి)
10. మోహన రామ (త్యాగరాజ కృతి)
11. చేరి యశోదకు శిశువితడు (అన్నమాచార్య కృతి)
        పైన చెప్పినవి కొన్ని ప్రసిద్ద కీర్తనలు మాత్రమే.

సినిమా సంగీతంలో మోహన రాగం:

        సినిమా సంగీతంలో మోహన రాగాన్ని వాడినంతగా వేరే ఏ రాగాన్ని వాడలేదనుకుంటా. కారణం ఏమిటంటే పైన చెప్పిన విధంగా ఈ రాగంలో నవరసాలు పలికించవచ్చు. ఉదాహరణకి….

లాహిరి లాహిరి లాహిరిలో -అని అలలపై తేలిపోయే ప్రణయ గీతానికైనా,
చెంగు చెంగునా గంతులు వేయండి -అనే ఉత్సావంతమైన పాటకైనా,
ఘనా ఘన సుందరా -అనిగానీ,
శివ శివ శంకరా భక్త వశంకర -అని దేవుణ్ణి వేడుకొన్నా,
మధుర మధురమీ చల్లని రేయీ -అని ప్రణయలోకాల్లో తేలిపోయినా,
ఈ నల్లని రాళలో ఏ కన్నులు దాగెనో -అంటు ఊహల్లో విహరించినా….
        ఈ రాగంలోనే సాధ్యం. ఈ పాటలు ఎంత ప్రసిద్ధి చెందాయంటే వీటిని వేరే రాగంలో వేరే ట్యూన్ లో ఊహించటం కూడ కష్టం.

        ఎస్. (సుస్వర) రాజేశ్వరరావు గారు ఈ రాగాధారంగా అనేక పాటలకు సంగీతం అందించారు. ‘ వినిపించని రాగాలే ‘ (చదువుకున్న అమ్మాయిలు - సుశీల), ‘ చూడుమదే చెలియా ‘ (విప్రనారాయణ - ఏ.ఎం.రాజ), మధుర మధురమీ చల్లని రేయీ (విప్రనారాయణ - ఏ.ఎం.రాజ, పి.భానుమతి), మదిలో వీణలు మ్రోగే (ఆత్మీయులు - సుశీల) కొన్ని అద్భుతమైన మోహన రాగంపై ఆధారితమైన సినిమా పాటలు.

        నాకు తెలిసిన పాటలు కొన్ని ఇక్కడ రాస్తున్నాను. మీకు తెలిసినవి నాకు చెప్పండి.

1. లాహిరి లాహిరి లాహిరిలో మాయాబజార్
2. ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి అప్పు చేసి పప్పు కూడు
3. చంగు చంగున గంతులు వేయండి నమ్మిన బంటు
4. శివ శివ శంకర భక్త వశంకర భక్త కన్నప్ప
5. ఈ నాటి ఈ హాయీ కల కాదోయి నిజమోయి జయసింహ
6. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమునుగుండమ్మ కధ
7. మధుర మధురమీ చల్లని రేయి విప్రనారాయణ
8. చూడుమదే చెలియా విప్రనారాయణ
9. కనులకు వెలుగువు నీవే కాదా భక్త ప్రహ్లాద


10. పాడవేల రాధిక ఇద్దరు మిత్రులు
11. నిన్ను కోరి వర్ణం ఘర్షణ
12. మనసు పరిమళించెనె శ్రీకృష్ణార్జున యుద్ధం
13. ఘనా ఘన సుందరా భక్త తుకారాం
14. తెల్లవార వచ్చె తెలియక నాసామీ చిరంజీవులు
15. తెలుసుకొనవె యువతి మిస్సమ్మ
16. సిరిమల్లె నీవే పంతులమ్మ
17. ఐనదేమో ఐనది జగదేకవీరుని కధ
18. మోహన రాగమహా మహా మంత్రి తిమ్మరుసు
19. పలికినదీ పిలిచినది సీత రాములు
20. చందన చర్చిత తెనాలిరామకృష్ణ
21. పులకించని మది పులకించు పెళ్ళికానుక
22. తిరుమల గిరివాసా రహస్యం
23. వే వేల గోపెమ్మల మువ్వా గోపాలుడె సాగర సంగమం
24. గోపాల జాగేలరా భలే అమ్మాయిలు
25. ననుపాలింపగ నడచీ వచ్చితివా బుద్ధిమంతుడు
26. రతిసుఖ సారె జయదేవ
27. జ్యోతి కలశ చలికే (హింది - భాభీకి చుడియా)
28. సయొనారా సయినారా (హింది - లవ్ ఇన్ టొక్యో)
29. ఆ మొగల్ రణధిరుల్ (ఘంటసాల వారి ప్రైవేటు ఆల్బం)
30. భారతీయుల కళా ప్రాభవమ్మొలికించి (ఘంటసాల వారి ప్రైవేటు ఆల్బం)
        ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో పాటలు ఉన్నాయి. తరచుగా అవే పాటలను వింటుంటె, మీరు కూడ ఏ పాట మోహనంలో ఉందో ఈజీగా చెప్పేయ గలరు. ప్రయతించండి.


        ( నాకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో, అది మీతో పంచుకోవాలనే ఆశతో, ఏదో రాయాలనే ఆత్రంతో ఈ ఆర్టికల్ రాసాను. నచ్చితే మెచ్చుకోండి, బాగాలేకపోతే విమర్శించండి. తప్పులుంటె క్షమించండి. )



Tags Tags: , ,
Categories: Telugu Posts
Posted By: D Subrahmanyam
Last Edit: 29 Mar 2010 @ 05 29 PM

EmailPermalinkComments (0)

 15 Feb 2010 @ 7:23 PM 

















Tags Tags: , ,
Categories: Art and artists
Posted By: D Subrahmanyam
Last Edit: 15 Feb 2010 @ 07 27 PM

EmailPermalinkComments (0)

 15 Feb 2010 @ 7:17 PM 




Radha Krishna






Ravana fighting with Jatayu

Raja Harischandra


Tags Categories: Art and artists Posted By: D Subrahmanyam
Last Edit: 15 Feb 2010 @ 07 17 PM

EmailPermalinkComments (0)

 15 Feb 2010 @ 7:12 PM 

Gangavataranam
Sita in Ashoka vana

Subhadra and Arjuna
Godess Saraswati





Menaka and Viswamitra



 


Tags Tags: ,
Categories: Art and artists
Posted By: D Subrahmanyam
Last Edit: 15 Feb 2010 @ 07 12 PM

EmailPermalinkComments (0)

హిందూ పవిత్ర గ్రంథాలలో వేదములు ప్రముఖమైనవి. వీటినే “శ్రుతులు”, “ప్రభు సంహితలు” అనికూడా అంటారు. శ్రుతి అనగా విన్నది అని అర్థం. ఇవి భగవంతుని ద్వారా తెలియ చేయబడినవి అని హిందువుల నమ్మకం. వేదం అనే పదం సంస్కృత పదం ‘విద్’ (తెలుసుకొనుట) నుంచి పుట్టింది. హిందువుల నమ్మకం ప్రకారం వేదములు సృష్టి కి ముందునుండే ఉండి, కాల క్రమేణా మహర్షులకు వారి ధ్యాన, తపోబలముల వలన ప్రకటించపడ్డాయి.

         ప్రతి వేద మంత్రమునకు ఒక అధిష్టాన దేవత ఉండి, ఆ మంత్రము ఆయనకు అంకితం చేయబడి ఉంటుంది.

         వేదములను వ్యాస మహాముని నాలుగు భాగాలుగా విభజించారు. ఒక నమ్మకం ప్రకారం ప్రతి ద్వాపరయుగాంతం లో ఈ విభజన జరుగుతుంది. ఇప్పటికి ఈ విభజన 27 సార్లు జరిగి ఉండవచ్చని అంచనా.

         మనకి ఉన్న వేదములు నాలుగు. వాటిని గురించి క్లుప్తంగా చర్చిద్దాం….









1. ఋగ్వేదం :


         ఈ వేదం అన్ని వేదాలలోనికి ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదం మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింప బడింది. అగ్ని దేవుడికి అంకితం చేయబడిన ఈ వేదానికి అధిష్టానదేవత గురువు (Jupiter). ఈ వేదం మొత్తం 10 మండలాలుగా (Books) విభజించబడి, 1028 సూక్తములతో (Hymns) 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది.

         ఈ వేదం మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని, ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తాలు, ఆత్మ సంబంధిత సూక్తాలు, సామాన్య జీవన విధాన సూక్తాలు ఇందులో పొందు పరచ బడ్డాయి.

         ఇందులోనే ‘ఐతిరేయ’ మరియు ‘కౌషితక’ ఉపనిషత్తులు ప్రస్తావించ బడ్డాయి










2. యజుర్వేదం :


         వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడ్డ ఈ వేదం వాయు దేవునికి అంకితం చేయబడింది. అధిష్టాన దేవత శుక్రుడు (Venus). ఈ వేదం 40 స్కంధాలుగా (Parts) విభజించబడి, 1975 శ్లోకాలతో అలరారుతుంది.

         ఈ వేదాన్ని ‘శుక్ల’ యజుర్వేదం అని, ‘కృష్ణ’ యజుర్వేదం అని రెండు భాగాలుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదం ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదం యఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది.

         యజుర్వేదం మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదం ముఖ్యం గా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానాలు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది.

         కృష్ణ యజుర్వేదంలో ‘తైతిరీయ ‘, ‘కథా’ ఉపనిషత్తులు ఉండగా శుక్ల యజుర్వేదంలో ‘ఈషా’, ‘బృహదారణ్యక’ ఉపనిషత్తులున్నాయి.










3. సామవేదం :


         ఈ వేదం మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించ బడింది. ఈ వేదానికి అధిష్టాన దేవత అంగారకుడు (Mars). ఈ వేదం ఆదిత్యునికి (Sun) అంకితం చేయబడింది.

         ఈ వేదం రెండుభాగాలుగా విభజించబడింది.
A). పూర్వార్సిక : 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.

B). ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.
         మొత్తం 1564 మంత్రాలలో 75 మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించ బడ్డాయి.

         మొదటిలో 1000 శాఖలుగా విస్తరించిన ప్రస్తుతానికి మూడు శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతం, శాంతి ప్రార్థనలు ఈ వేదంలో మనకు కనపడే విశేషాలు.









4. అధర్వ వేదం


         ఈ వేదం మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించదడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదానికి బుధుడు అధిష్టాన దేవత.

         ఈ వేదం రెండుభాగాలుగా విభజించ బడినది.
A). పూర్వార్ధ: అనేక విషయాలపై చర్చ.

B). ఉత్తరార్ధ: వివిధ ఆచారాలపై కూలంకష చర్చ.
         అధర్వ వేదం నాలుగు భాగాలుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది.

         మొదట తొమ్మిది శాఖలలో ఉన్న ఈ వేదంలో ప్రస్తుతం 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.

         ఈ వేదంలో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామం గురించిన కథలు, భూతపిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రాలు, మంత్రవిద్య, తంత్ర విద్య లకు సంబంధించిన విషయాలు కూడా పొందుపరిచారు.

         ఇందులో 93 ఉపనిషత్తులు పొందు పరిచి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ‘ప్రశ్న’, ‘మాండూక’, మరియు ‘మాండుక్య’ ఉపనిషత్తులు.




***        ***        ***
ప్రతి వేదాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చు.

         1. మంత్ర సంహితలు: ఇహలోక పరలోక లభ్ధికోసం వివిధ దేవతల గురించిన ప్రార్థనలు ఉన్న భాగం.

         2. బ్రాహ్మణములు: వివిధ ఆచారాలు వాటిని పాటించేవిధాలని గురించి వివరించే భాగం.

         3. అరణ్యకాలు: ఆచారాలకు తాత్విక (Philosophical) వివరణ.

         4. ఉపనిషత్తులు: వీటినే వేదాంతాలు అనికూడా అంటారు. ఇవి వేదాలలోని సారాంశాన్ని వివరిస్తాయి.

         మొత్తం వేద విజ్ఞానాన్ని ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణాలు ఆ చెట్టు పూలుగా, అరణ్యకాలు పచ్చి కాయలుగా, ఉపనిషత్తులని పండ్లుగా వర్ణించ వచ్చు.

         ఊపవేదములు: వేదాల వెలె కాకుండా ఉపవేదములు మహామునులచే లిఖించబడినవి. వీటినే “స్మృతులు” అనికూడా అంటారు. ఇవి వేదాల వలనే మొత్తం నాలుగు.

         1. ఆయుర్వేదం: ఋగ్ వేదానికి సంబంధించిన ఇది ఆరోగ్యాంగా జీవించటానికి పాటించవలసిన విధులని తెలిపే శాస్త్రం.

                A) చరక సంహిత: మహాముని చరకునిచే రచించబడిన గ్రంథం.

                B) శుశ్రుత సంహిత: మహాముని శుశ్రుతుని రచన.

                C) వాగ్భట్ట సంహిత: మహాముని వాగ్భట్టుని రచన.

                D) కామ సూత్రములు: మహాముని వాత్సాయనుని రచన.

         2. ధనుర్వేదం: యజుర్వేదానికి సంబంధించిన ఈ ఉపవేదం బ్రహ్మర్షి విశ్వామిత్రునిచే రచించబడినది. ఇది ముఖ్యంగా సైన్య (Military) శాస్త్రానికి సంబంధించినది. మొత్తం నాలుగు భాగాలలో ఈ శాస్త్రం యుద్దానికి సంబంధించిన అన్ని విషయాలని చర్చిస్తుంది. ఇందులోనే వివిధ మారణాయుధాలు, మంత్ర యుద్ధ పద్ధతులు యుద్ధ వ్యూహాల గురించి విపులం గా చర్చించబడింది. 

  3. గంధర్వ వేదం: సామవేదానికి సంబంధించిన ఈ ఉపవేదం ముఖ్యంగా కళలకు, సంగీతానికి సంబంధించిన శాస్త్రం. భరత మహాముని రచించిన గంధర్వ శాస్త్రం ఈ కోవలోనికి వస్తుంది.

         4. అర్థశాస్త్రం: రాజకీయ మరియు అర్థశాస్త్రం. ఇందులో నీతిశాస్త్రం, శిల్పశాస్త్రం, అరవైనాలుగు కళలు, ఇంకా అనేక భౌతిక , ప్రాపంచిక విషయాలను కులంకుషంగా చర్చించారు.









వేదాంగములు:


         ఆనవాయతి ప్రకారం వేదాభ్యాసానికి ముందుగా ఈ వేదాంగములని నేర్చుకోవాలి. వేదాంగములు మొత్తం ఆరు.

         1. శిక్ష (Phonetics): పాణిని రచించిన శిక్ష.

         2. వ్యాకరణము (Grammer): పాణిని రచించిన వ్యాకరణము, పతంజలి రచించిన మహాభాష్యము. ఇది పాణిని వ్యాకరణానికి వివరణ.

         3. ఛందస్సు: పింగళాచార్యుల ఛందస్సు.

         4. నిరుక్త (EtymOlogy): యక్షుని నిరుక్త.

         5. జ్యోతీష: ఖగోళ మరియు జాతక శాస్త్రము, గార్గి ముని రచించిన జ్యోతిష గ్రంథము, ఇంకా చాలా గ్రంథములే ఉన్నాయి. భారతీయులు ఖగోళ శాస్త్రంలో వేద కాలంలోనే చాలా ప్రగతి సాధించిన విషయం జగమెరిగిన సత్యం.

         6. కల్ప: ఆచార సంప్రదాయ పద్ధతుల గురించిన శాస్త్రం. ఇందులో మూడు భాగాలున్నాయి.

                I) శుశ్రుత కల్ప: భగవంతునికి ఇచ్చే బలి, నైవేద్య పద్దతులు.

                II) శులభ కల్ప: కొలతలు మొదలైన విషయాలను తెలిపే కల్పము.

                III) ధర్మ కల్ప: నీతి , ధర్మ విషయాలకు సంబంధించినది. ధర్మ కల్పంలో మొత్తం 18 విభాగాలున్నాయి. వాటిలో ప్రముఖమైనవి మూడు.

                         1. మను స్మృతి: ఈ ధర్మసూత్రాలు త్రేతాయుగానికై నిర్దేశించబడినవి.

                         2. యాఙ్ఞవల్క్య స్మృతి: త్రేతా యుగానికై నిర్దేశించబదినది.

                         3. పరాశర స్మృతి: కలియుగానికై నిర్దేశించబడినది.






***


Tags Categories: Telugu Posts Posted By: D Subrahmanyam
Last Edit: 15 Feb 2010 @ 07 02 PM

EmailPermalinkComments (0)

 15 Feb 2010 @ 6:57 PM 

Six people sit down to a sumptuous meal at a table laid for seven. A sprig of rosemary–’rosemary for remembrance’–marks the empty place. It is the first anniversary of the horrific death by cyanide-laced champagne of the beautiful and troublesome Rosemary Barton. The assembled guests are the same participants at the meal a year prior. At first it was thought that Rosemary Barton committed suicide by consuming cyanide with champagne. Rosemary’s widower, George Barton, is determined to prove that one of them is a murderer. But George’s dinner party, and his plans for justice, will go terribly awry, as the murderer strikes again. George Barton himself is the victim this time. He is also murdered in the same way as Rosemary with cyanide in his champagne in his glass. Colonel Race of the British Secret Service, friend of Hercule Poirot is on the scene to investigate. Who could be the murderer of the remaining five people? The story has many twists as every Agatha christie book has. And finally the murderer was found.
Read this book if you like thrillers and i am sure you will not keep the book down till you complete it.


Tags Tags:
Categories: Books
Posted By: D Subrahmanyam
Last Edit: 15 Feb 2010 @ 06 57 PM

EmailPermalinkComments (0)

 15 Feb 2010 @ 6:55 PM 

I recently purchased this book from the market. I read this book under a different title “Ten Little niggers” when i was in my plus 2. This book is also has another title as “Ten little Indians”

The Story briefly goes like this:
Ten people were invited to an island by a unknown person. Each person is invited with a letter mentioning a close friends name as reference. The people invited includes 3 females, and 7 males of which one is a doctor, one judge, one army officer a cook and his wife, a school teacher etc. When they reach the destination they find that the host is not available but the cook and his wife receives them. The mystery begins then and there itself. One after the other each of the guests were murdered. Every one starts suspecting the other person as a murderer. Till the last one gets killed. There is a tray with ten nigger figures on the dining table. As soon as a person is killed one figure disappears mysteriously. All attempts made by the guests to escape from the island were futile and they have to die there only. But who is the murderer?

The book goes through many twists and u can not keep the book down till the last page.
No I am not going to reveal the suspence. read it and know that.
Clue:: Did u see the hindi movie “Gumnaam” ? This movie is based on this novel.
What are u waiting for! Go and get the book
Happy reading


Tags Tags:
Categories: Books
Posted By: D Subrahmanyam
Last Edit: 15 Feb 2010 @ 06 55 PM

EmailPermalinkComments (0)

 15 Feb 2010 @ 6:45 PM 

Nurse Amy Leatheran had never felt the lure of the “mysterious East,” but she nonetheless accepts an assignment at Hassanieh, an ancient site deep in the Iraqi desert, to care for the wife of a celebrated archaeologist. Mrs Leidner is suffering bizarre visions and nervous terror.  She receives anonymous letters from her first husbend who was supposed to be long ago. “I’m afraid of being killed!” she admits to her nurse. Her terror, unfortunately, is anything but unfounded, and Nurse Leatheran is soon enough without a patient. Mrs Leidner was  murdered in her bed, hit on the head with a heavy object . The world’s greatest detective happens to be in the vicinity, however: having concluded an assignment in Syria, and curious about the dig at Hassanieh, Hercule Poirot arrives in time to lead a murder investigation that will tax even his remarkable powers–and in a part of the world that has seen more than its share of misadventure and foul play. Poitor suspects that it is an inside job and one of the 8 peoples present at the dig is in fact the murderer. While investigation was on one more person becomes victim of the murderer. This time the murder was committed with acid subsittuted for drinking water. “Murder is a habit” was the conclusion drawn by the famous Belgian detective Hercule Poirot. He corrctly identifies the killer at the end.
Set in an archeological site in Iraqi desert, the book has lots of twists making the reader sit on the edge till the last page. Read this book if you are in for real thrils.


Tags Tags:
Categories: Books
Posted By: D Subrahmanyam
Last Edit: 15 Feb 2010 @ 06 45 PM

EmailPermalinkComments (0)

ఈ శివతాండవస్తోత్రాన్ని రావణబ్రహ్మ పరమశివుని గురించి ఆశువుగా చెప్పాడని ప్రతీతి. రావణబ్రహ్మ భక్తి తత్పరతకి ఈ స్తోత్రం ఒక మచ్చుతునక.




  1. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
    గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
    డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
    చకారచండతాండవంతనోతునశ్శివశ్శివం

     
  2. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
    విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ
    ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
    కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ

     
  3. ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
    స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే
    కృపాకటాక్షధోరణీ నిరుద్ధ్దుర్ధరాపది
    క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

     
  4. జటాభుజంగపింగళ స్ఫురత్ఫనామణిప్రభా
    కదంబకుంకుమద్రవప్రలిప్తదిహ్వధూముఖే
    మదాంధసిందురస్ఫుర త్వగుర్తరీయమేదురే
    మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి

     
  5. సహస్రలోచన ప్రభుత్యశేషలేఖశేఖర
    ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూ:
    భుజంగరాజమాలయానిబద్ధజాటజూటక:
    శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖర:

     
  6. లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా
    నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకం
    సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరం
    మహాకపాలిసంపదేశిరోజటాలమస్తున:

     
  7. కరాళ ఫాలపట్టికా దగద్ధగద్ధగజ్జ్వల
    ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే
    ధరాధరేంద్రనందినీ కుచాగ్రచిత్రపత్రక
    ప్రకల్ప నైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ



  1. నవీన మేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్
    కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ధకంధరః
    నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
    కళానిధాన బంధురః శ్రియం జగుద్ధురంధరః

     
  2. ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
    వలంబి కంఠకందలీ రుచుప్రబద్ధకంధరం
    స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
    గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

     
  3. అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ
    రసప్రవాహమాధురీ విజృంభణామధూవ్రతం
    స్మరాంతకం పురాంతకమ్ భవాంతకమ్ మఖాంతకం
    గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

     
  4. జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మశ్వస
    ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళఫాలహవ్యవాట్
    ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగతుంగమంగళ
    ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః

     
  5. దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో
    ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:
    తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
    సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్

     
  6. కదానిలింపనిర్ఝరీ నికుంజకోతరేవసన్
    విముక్తదుర్మతిః సదాశిరఃస్థమాంజలింవహన్
    విలోలలోలలౌర్చనో లలాలబాలలగ్నహః
    శివేతిమంత్రముచ్ఛరణ్ సదాసుఖిః భవావ్యహం

     
  7. నిమగ్ని నిత్యమేవముక్తముక్తమోత్తమం స్తవం
    పఠన్స్మరంబృవనరో విశుద్ధిమేతిసంతతం
    హరేగురౌ సుభక్తిమాసుయాతినాం యధాగతిం
    విమోహనం హి దేహినాంసు శంకరస్య చింతనం

ఫలస్తుతి:




  • పూజావసానసమయే దశవక్తంగీతం
    యః శంభుపూజనపరం పఠతిః ప్రదోషే
    తస్యస్థిరాం రదగజేంద్రతురంగయుక్తాం
    లక్ష్మీంసదైవసుముఖీం ప్రదదాతి శంభుః


Tags Categories: Telugu Posts Posted By: D Subrahmanyam
Last Edit: 15 Feb 2010 @ 06 36 PM

EmailPermalinkComments (0)




\/ More Options ...
Change Theme...
  • Users » 35793
  • Posts/Pages » 60
  • Comments » 215
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.